![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ‘బ్రహ్మముడి’. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -257లో... కావ్య కావాలనే రాజ్‌ని ఆటపట్టించాలని బుక్‌లో ఒక రొమాంటిక్ స్టోరీని చదువుతుంటుంది. అలా రాజ్‌ని కాసేపు అడుకుంటుంది. ఆ తర్వాత నీతో నాకు ఏ బంధం, సంబంధం ఉండదని రాజ్ కోపంగా చెప్పి వెళ్లిపోతాడు. ఎలా ఉండదో నేను చూస్తానని కావ్య అనుకుంటుంది.
అరుణ్ ఏంటి ఇలా చేస్తున్నాడని ఆలోచిస్తుంటుంది కావ్య. ఒకవైపు అరుణ్ ఇంక రాలేదని రాహుల్, రుద్రాణి ఇద్దరు వెయిట్ చేస్తుంటారు. అప్పుడే అరుణ్ వచ్చి రాహుల్‌కి ఫోన్ చేసి మీ ఇంటి ముందు ఉన్నానని చెప్పగానే.. నువ్వు ఇప్పుడు స్వప్నకి ఫోన్ చేసి బయటకు రమ్మని చెప్పు అని చెప్తాడు. రాహుల్ అలా చెప్పగానే అరుణ్ సరేనని స్వప్నకి ఫోన్ చెయ్యగానే.. ఇష్టం వచ్చినట్లుగా నీతో కలిసి తిరిగినంత మాత్రాన ఇంటికి ఫొటోస్ పంపిస్తావా అని స్వప్న తిడుతుంది. నేను మీ ఇంటి ముందు ఉన్నాను నాతో ఒక అయిదు నిమిషాలు మాట్లాడు ఎందుకు పంపించానో అర్థమవుతుందని అరుణ్ అనగానే.. ఎవరూ చూడకుండా స్వప్న బయటకు వస్తుంది.. మరొక వైపు అరుణ్‌తో స్వప్న మాట్లాడేది రాజ్ చూడాలని రాహుల్ రాజ్‌కీ ఫోన్ చేసి.. మాట్లాడాలి బాల్కనీలోకి రా అని చెప్పగానే రాజ్ వస్తాడు. అదేసమయంలో రుద్రాణి పైనుండి చూస్తుంటుంది. మరొక వైపు కావ్య కూడా అరుణ్ స్వప్న ఇద్దరు మాట్లాడుకోవడం చూస్తారు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని అరుణ్‌ని స్వప్న అడుగుతుంది. నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకుంటాను. అందుకే ఇదంతా అని అరుణ్ చెప్పగానే.. అరుణ్‌ని తిడుతుంది స్వప్న. రాహుల్ ఏదో చెప్పాలి అన్నావ్ ఏంటని రాజ్ అడుగుతాడు. ఏం లేదు తర్వాత చెప్తానంటు రాహుల్ బాధపడుతున్నట్లుగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అరుణ్ , స్వప్న మాట్లాడుకోవడం రాజ్ బాల్కనీ నుండి చూస్తాడు. చూడగానే అపార్ధం చేసుకోకుండా ఫ్రెండ్ అయి ఉంటాడని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత స్వప్న లోపలకు వస్తుంది. అక్కడే ఉన్న కావ్య.. స్వప్నని గదిలోకి తీసుకొని వెళ్తుంది. మరొకవైపు రాహుల్ రుద్రాణిలు.. రాజ్‌కి స్వప్నపై డౌట్ వచ్చేలా చేసామని సంబరపడుతుంటారు.
అరుణ్ ఎందుకు వచ్చాడని స్వప్నని అడుగుతుంది కావ్య. స్వప్న జరిగిందంతా చెప్తుంది. ‘‘ఒకటి చెప్పాలి, మళ్ళీ ఒక సమస్య వచ్చింది’’ అని కృష్ణమూర్తితో కనకం అనగానే కృష్ణమూర్తి షాక్ అవుతాడు. తరువాయి భాగంలో ఇందిరాదేవి కొరియర్లో వచ్చిన అరుణ్ ఫోటోని రాజ్‌కి చూపించి.. ఇతని గురించి కనుక్కో, స్వప్నతో కలిసి ఉన్న ఫొటోస్ కూడా కొరియర్లో వచ్చాయని ఇందిరా దేవి చెప్తుంది. ఆ తరువాత రాజ్ కావ్యకి అరుణ్ ఫొటో చూపించి ఎవరని అడుగుతాడు. మా అక్క కాలేజీ ఫ్రెండ్ అరుణ్ అని కావ్య చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |